హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పశుసంవర్ధక రైతుల సమస్యలు పరిష్కరించాలి: నల్లా పవన్

కోనసీమ: పశుసంవర్ధక రైతుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కోరారు. ఈ మేరకు సోమవారం పార్టీ ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవికి వినతిపత్రం సమర్పించారు. పశువైద్యుల ఖాళీల భర్తీ, 1962 మొబైల్ సేవల అమలు, బీమా పరిహారం, మరణ పరిహారం, గోకులం షెడ్ల పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.