హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి'

AKP: అల్లిఖాండుపాలెం ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు జారీ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, అక్రమ పట్టాలను రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్‌లు 80, 81లోని భూముల రికార్డులను పరిశీలించి, అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.