హైదరాబాద్: 28°C
క్రీడలు

సెంచరీతో మెరిసిన జడేజా

స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున అద్భుత సెంచరీతో మెరిశాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 205 బంతుల్లో శతకం బాదాడు. 102 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. జడేజా కెరీర్‌లో ఇది 16వ ఫస్ట్‌క్లాస్ సెంచరీ. కాగా, ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగులకు ఆలౌటైంది.