హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోడ్ల నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలి'

AKP: పరవాడ మండలం లంకెలపాలెం నుంచి పరవాడ, ఎన్టీపీసీ వరకు రోడ్ల నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రహదారులపై గోతులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భారీ వాహనాల అధిక లోడుతో రోడ్లు దెబ్బతింటున్నాయని తెలిపారు.