హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కెటిల్బాల్ క్రీడాకారులను అభినందించిన శాప్ ఛైర్మన్

TPT: ప్రపంచ కెటిల్బాల్ ఛాంపియన్ షిప్‌లో తిరుపతి క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు.నమ్రత వాకా, నిహారిక, రుద్రరాజు మూడు బంగారు పతకాలు సాధించగా, జీలాని బాషా, వనజ రెండు బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ రవి నాయుడు విజేతలను అభినందించి సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఏపీకి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.