హైదరాబాద్: 28°C
క్రీడలు

సెంచ‌రీతో చెల‌రేగిన జ‌డేజా

టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా రంజీ ట్రోఫీలో సెంచరీతో చెలరేగాడు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్డూ.. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 102 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు ఉన్నాయి. కాగా, జడేజా కెరీర్‌లో ఇది 16వ ఫస్ట్‌క్లాస్ సెంచరీ. వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న జడేజా రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించాడు.