హైదరాబాద్: 28°C
వార్తలు

రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి: హరీష్‌రావు

TG: సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. శ్రీశైలం నుంచి నీటిని తరలించడం వల్లే పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి నీళ్లు వెళ్తున్నాయని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నీటిని రేవంత్‌రెడ్డి వదిలేస్తుంటే, ఏపీ సీఎం చంద్రబాబు ఆ నీటిని ఒడిసిపట్టి వినియోగించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.