హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం

ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ ధర్నా వేదిక జంతర్ మంతర్‌ను తొలగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై జంతర్ మంతర్ వద్ద ఎలాంటి ధర్నాలు, నిరసనలు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా మూడు ప్రదేశాలను వారు సూచించారు. ఇకపై రాంలీలా మైదానం, బురాడీ, సీబీడీ గ్రౌండ్స్‌లో మాత్రమే ధర్నాలకు అనుమతి ఉంటుందని పోలీసులు వెల్లడించారు.