మార్కాపురం: మొక్కజొన్న పంట బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. రైతులు మార్కాపురం కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. లక్ష్మీ ప్రసన్న సీడ్ కంపెనీతో పాటు ఇతర విత్తన కంపెనీలు పంట బకాయిలు చెల్లించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి ఇచ్చి సాగు చేయించి, పంటను తీసుకెళ్లినా డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'మొక్కజొన్న బకాయిలు చెల్లించాలి'


