హైదరాబాద్: 28°C
తెలంగాణ

బండల నాగపూర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల అందజేత

ADB: తాంసి మండలం బండల నాగపూర్‌లో కేసీఆర్ హయాంలో నిర్మించిన 130 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డితో కలిసి సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మీ చెక్కులను సైతం పంపిణీ చేశారు. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా కేసీఆర్ ఈ ఇళ్ల పథకాన్ని తెచ్చారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు.