హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.10 లక్షలతో రోడ్డు పనులు ప్రారంభం

KRNL: ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో రూ.10 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి గ్రామ నాయకుడు విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణంతో గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.