KMR: బాన్సువాడ మండలం తాడ్కోల్లో బతుకమ్మ సంబరాల నేపథ్యంలో నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ 10వ కాలువను సర్పంచ్ రమేష్ శుభ్రం చేయించారు. కాలువలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని పంచాయతీ సిబ్బందితో తొలగించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు ఇబ్బందులు కలగకుండా, వేడుకలను ప్రశాంతంగా, పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ
బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు


