హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైడిపాడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రకాశం: జరుగుమల్లి మండల పైడిపాడులో సోమవారం ఎమ్మార్వో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సహా వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలు, స్థల వివాదాలపై ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కరిస్తామన్నారు.