AKP: బుచ్చయ్యపేట మండలం వడ్డాది శివారులో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయరామరాజుపేటకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు దొడ్డి అమిత్ కుమార్ (43) పల్సర్ బైక్‌పై వెళ్తూ రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్‌ఐ మనోజ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చోడవరం ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి


