హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మురుగునీటి సమస్యతో స్థానికుల అవస్థలు

కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీ సీ-159 బ్లాక్‌లో మురుగునీరు పారుదల కాకపోవడంతో పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొనే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు నిల్వ వల్ల దుర్వాసనతో పాటు దోమలు వృద్ధి చెంది ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల స్పందించి, తగు చర్యలు తీసుకోవాలన్నారు.