హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆమంచి

BPT: చీరాల మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ నేత ఆమంచి కృష్ణమోహన్ సోమవారం ప్రారంభించారు. సోమవారం 1వ వార్డులోని సీయెను ఆలయంలో ఆయన ప్రార్థనలు చేశారు. తర్వాత 1, 2, 3 వార్డుల్లో పర్యటించి స్థానికులు, నాయకులతో భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయన వారితో విస్తృతంగా చర్చించారు.