SKLM: కొత్తూరు మండలంలోని వసప గ్రామంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశారు. తిరుమల శ్రీవాణి ట్రస్ట్ నిధులు రూ.40 లక్షలతో నిర్మించనున్న ఈ ఆలయానికి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన


