హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పశుగ్రాసం కొరతతో పశువులను విక్రయిస్తున్న రైతులు

KRNL: పత్తికొండ పశువుల సంతకు సోమవారం రైతులు పెద్ద సంఖ్యలో పశువులను తరలించినట్లు తెలిపారు. వర్షాలు లేక పశుగ్రాసం దొరక్కపోవడంతో పశువులను విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలూరు, చిప్పగిరి, ఆస్పరి మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. తమ ప్రాంతాలను కరవు మండలాలుగా ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.