హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయనిధి చెక్కులు అందజేత

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో 50 మంది లబ్దిదారులకు రూ.28.32 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అందజేశారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 1,207 మందికి రూ.8.70 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.