హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రేమజంట వివాహం

KRNL: నందవరంలో ఓ ప్రేమజంట అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హాలహర్వికి చెందిన ముస్లిం యువకుడు షేక్షావలి, దళిత యువతి శాంతి కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరువైపులా పెద్దలు అంగీకరించకపోవడంతో సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్రాధికార ప్రతినిధి రంగయ్యను ఆశ్రయించారు. దీంతో ప్రేమికుల అంగీకారంతో ఆయన వారి వివాహం జరిపించారు.