హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చలికాలంలో జామపండ్లు తింటే?

జామపండులో నారింజ పండ్ల కంటే ఎక్కువ విటమిన్ C ఉంటుంది. ఇది చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొడిబారే చర్మానికి తేమను అందించి మెరుగ్గా ఉంచుతుంది. బాగా పండిన జామపండ్లను మాత్రమే తినాలి. మరీ పచ్చిగా ఉన్నవి తింటే కడుపులో గ్యాస్ లేదా ఎసిడిటీ రావొచ్చు.