హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మార్నింగ్ ఈ టిఫిన్ చేయకండి

ఉదయం టిఫిన్‌లో పూరీలు, బజ్జీలు, వడలు వంటి నూనెలో వేయించిన పదార్థాలను తరచూ తినడం తగ్గించాలి. కేకులు, తీపి బిస్కెట్లు, అధిక చక్కెర ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. వీటికి బదులుగా ఇడ్లీ, పెసరట్టు, కూరగాయల ఉప్మా, ఓట్స్‌, గుడ్లు తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.