హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నిద్రలేవగానే కళ్లు తిరుగుతున్నాయా?

ఉదయం నిద్రలేవగానే కళ్లు తిరగడం వెనుక నీటి కొరత, విటమిన్ D లోపం, రక్తపోటు వంటి సమస్యలు ఉండవచ్చు. రాత్రి సమయంలో శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల లేవగానే తల తిరిగినట్లు అనిపిస్తుంది. విటమిన్ డి సరిగా లేనివారిలో లేవగానే కళ్లు తిరగడం, తూలిపోవడం జరుగుతుంది. పడుకుని ఉన్న స్థితి నుంచి అకస్మాత్తుగా లేచినప్పుడు రక్తపోటులో వచ్చే మార్పుల వల్ల మైకం వస్తుంది. నిద్రలేమి కూడా కారణం కావచ్చు.