AKP: రావికమతం మండలం దొండపూడి నుంచి కల్యాణలోవకు వెళ్లే రహదారి గోతులమయంగా మారింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి దెబ్బతినడంతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గోతులతో నిండిన దొండపూడి రహదారి


