హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం

NTR: జొన్నలగడ్డ ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది వాహనదారులకు ప్రమాదకరంగా మారి, రాత్రి వేళల్లో ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి స్తంభాన్ని పక్కకు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.