హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతికి ప్రధాని మోదీ, అమిత్ షా, ధోవల్?

TPT: డిసెంబర్ 4 నుంచి 6 వరకు తిరుపతి జిల్లా ఏర్పేడు ఐసర్‌ (IISER) వేదికగా 'అఖిల భారత డీజీపీల సన్మాన/సమావేశం' జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ ధోవల్‌ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 400 మంది ఐపీఎస్‌ అధికారులు ఈ కీలక సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.