ప్రకాశం: అర్ధవీడు (M) పాపినేనిపల్లికి చెందిన రసులయ్యను ఘర్షణ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి వెళ్తుండగా రసులయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కుమారుడి అరెస్టును తట్టుకోలేక తల్లి సుబ్బలక్ష్మమ్మ సోమవారం పోలీస్ స్టేషన్ వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
కొడుకు అరెస్టు.. తల్లి ఆత్మహత్యాయత్నం


