KRNL: మంత్రాలయం రామచంద్రనగర్ కాలనికి చెందిన యువకుడు గురు, ఇవాళ రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మంత్రాలయంలో డీజే సౌండ్ బాక్సులు అద్దెకు ఇచ్చేవాడు. ఐదు నెలల కిందట రాంపురం గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుకున్నారు. యువకుని మృతితో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య


