హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

3 నెలలుగా ప్రమాదకరంగా మ్యాన్‌హోల్.. స్థానికుల ఆగ్రహం

కాకినాడలోని దుర్గా విద్యుత్ నగర్ వాసులు కార్పొరేషన్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ నంబర్-2లో మూడు నెలలుగా ప్రమాదకరంగా ఉన్న మ్యాన్‌హోల్ మూసివేయాలని కమిషనర్ ఆదేశించినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ప్రాణనష్టం జరిగితే అధికారులే బాధ్యత వహించాలని 'ఫోరమ్ ఫర్ బెటర్ కాకినాడ' అధ్యక్షుడు కొలగాని మూర్తి అన్నారు.