హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపల్లి ఛైర్మన్ పీఠం కోసం పెరుగుతున్న పోటీ..!

NTR: కొండపల్లి పురపాలక సంఘం ఛైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అవుతుందన్న ఊహాగానాలతో రాజకీయంగా పోటీ పెరుగుతోంది. ఈ పదవిని దక్కించుకునేందుకు కూటమి నుంచి సుమారు 10 మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలోనూ ఛైర్మన్ పదవిపై ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. రిజర్వేషన్‌పై స్పష్టత వచ్చిన తర్వాత రెండు పార్టీల్లోనూ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.