హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

అన్నమయ్య: రాయచోటి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాలుగు మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. రూరల్, చిన్నమండెం, వీరబల్లి, సుండుపల్లి మండలాల్లో ఒక్కో దుకాణానికి లైసెన్స్ జారీ చేయనున్నారు. ఈ నెల 19 అర్ధరాత్రి లోపు దరఖాస్తు చేసుకోవాలి. 21న మదనపల్లె కలెక్టరేట్‌లో లాటరీ నిర్వహిస్తామని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వై. గురుప్రసాద్ తెలిపారు.