అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం కాపుపల్లెకు చెందిన నాగరత్నమ్మ (45) హత్య కేసులో నిందితుడు భర్త నరసింహులును పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. భార్య కువైట్ వెళ్లేందుకు పాస్‌పోర్టు చేయించుకోవడంపై జరిగిన గొడవలో ఈ నెల 7న రోకలిబండతో దాడి చేయగా, చికిత్స పొందుతూ ఆమె 8న మృతి చెందింది. నిందితుడిని రిమాండ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్


