హైదరాబాద్: 28°C
వ్యాపారం

లాభాలతో మొదలైన ట్రేడింగ్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ మొదలైన తొలి నిమిషాల్లోనే మార్కెట్లు మంచి జోరు కనబరిచాయి. ఉదయం 9.17 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 364 పాయింట్లు లాభపడి దూసుకెళ్లింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 50 కూడా 125 పాయింట్లు పెరిగింది. ఉదయం నుంచే దేశీయ సూచీలు ఆకుపచ్చ రంగులో పచ్చబడటంతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం నెలకొంది.