హైదరాబాద్: 28°C
వ్యాపారం

తగ్గనున్న ఉల్లిపాయల ధరలు..!

ఖరీఫ్‌ పంట ఉల్లిపాయల సరఫరా పెరుగుతుండటంతో రానున్న వారాల్లో ధరలు తగ్గే అవకాశం ఉంది. కొత్త పంట మార్కెట్లకు చేరుతుండటంతో పాటు పాత నిల్వలు అందుబాటులో ఉండటం సరఫరాను మెరుగుపరచనుంది. ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం బఫర్‌ స్టాక్‌ ఉల్లిపాయలను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తోంది. దీంతో పండుగల వేళ వినియోగదారులకు కొంత ఊరట లభించే అవకాశముంది.