కోనసీమ: అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని బీసీ మహిళకి కేటాయించినట్లు వార్తలు వినపడుతున్నాయి. రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీలలో కులాల వారీగా రిజర్వేషన్లు ఖరారుకు మున్సిపల్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ పదవి ఓసీ జనరల్‌కు దక్కుతోందని పలువురు ఆశించగా, మళ్లీ బీసీ వార్తలు రావడంతో వారు నిరాశ చెందుతున్నారు. కాగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పీఠం బీసీ మహిళ?


