NDL: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు భాగంగా శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవారు శైలపుత్రి అలంకారంలో పూజలు అందుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన అలంకార మండపంలో అమ్మవారికి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శైలపుత్రిగా పూజలు అందుకున్న శ్రీశైల భ్రమరాంబ


