హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవరపల్లి కాలువ గట్టుపై పెద్ద పులి?

E.G: దేవరపల్లి ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు స్థానికులు తెలిపారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ గట్టు మీదుగా లక్ష్మీపురం మీదుగా సంచరించిన పులి కదలికలను కొందరు తమ సెల్ కెమెరాలలో చిత్రీకరించారు. ఈ సమాచారం వ్యాపించడంతో దేవరపల్లి చుట్టుపక్కల గ్రామాల వారు అప్రమత్తమయ్యారు. రైతులు, పశువుల కాపలా దారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.