హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సోమవారం ప్రజావాణి సమయం కుదింపు'

HNK: హన్మకొండ జిల్లాలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే నిర్వహించనున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో సీఎం రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌ ప్రసారం కానుందని పేర్కొన్నారు. ఎల్‌నినో, వ్యవసాయ అంశాలపై జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.