హైదరాబాద్: 28°C
తెలంగాణ

సేవాలాల్ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

MDK: నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి విస్తృతంగా పర్యటించారు. హత్నూర మండలంలోని భీమ్లా తండా, దేవుని గుట్ట తండాలలో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం షేరఖాన్పల్లిలో నూతనంగా నిర్మించిన దుర్గామాత షెడ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.