హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు

SRPT: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పవిత్రోత్సవాలు ఆదివారం పూర్ణాహుతి, శాంతి కల్యాణంతో ఘనంగా ముగిశాయి. యాజ్జీ వాసుదేవాచార్యుల నేతృత్వంలో రుత్వికులు త్రయాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సప్త దశకుంభారోపణం, విశేష పూజలు జరిగాయి. ఈ వేడుకల్లో ధర్మకర్తలు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈవో టీవీ చలపతి, అర్చకులు పాల్గొన్నారు.