సత్యసాయి: మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆదివారం పెనుకొండ, పరిగి మండలాల్లోని పలు గ్రామాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై పోరాడుతూ శ్రేణులంతా ఐకమత్యంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
శ్రేణులంతా ఐకమత్యంతో పనిచేయాలి: ఉషశ్రీ చరణ్


