హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కి గాయాలు

ప్రకాశం: టంగుటూరు (M) సూరారెడ్డిపాలెం సమీపంలోని నేషనల్ హైవేపై సోమవారం తెల్లవారుజామున ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బస్సు చెన్నై నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.