హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగారమ్మ అవ్వకు రూ.2.18 లక్షల కానుక

KRNL: పెద్దకడబూరు మండలంలోని బసలదొడ్డి గ్రామంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన గొల్ల జగన్నాథ్‌ గ్రామదేవత శ్రీ బంగారమ్మ అవ్వకు రూ.2.18 లక్షల విలువైన వెండి ఆభరణాలను మొక్కుబడిగా ఇవాళ సమర్పించారు. నాలుగు వెండి పాదాలతో పాటు వెండి ఖడ్గం, గొడ్డలిని అమ్మవారికి కానుకగా అందించారు.