హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ భవాని అలంకరణలో రాజరాజేశ్వరి దేవి

నెల్లూరు నగరంలోని దర్గా మిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు సోమవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు భవానీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.