హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకు గిరిజన అథ్లెట్‌కు రెండు స్వర్ణ పతకాలు

ASR: అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీ గరుడగుడ గ్రామానికి చెందిన కిల్లో బుద్ధు 45వ రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 5, 10 కిలోమీటర్ల పరుగు పందాల్లో బంగారు పతకాలు సాధించారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగిన పోటీల్లో ప్రతిభ చాటి, జనవరి 2027లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విజయం గిరిజన యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం.