హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూల కోసం వెళ్లి కుంటలో పడి వ్యక్తి మృతి

MHBD: మహబూబాబాద్ పట్టణంలో తామర పూల కోసం కుంటలో దిగిన వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నందమూరినగర్ కాలనీలో ఉంటున్న బచ్చలి కుమార్ (45)ఈ నెల 9వ తేదీన పట్టణ పరిధిలోని దామరకుంటలో తామరపూల కోసం వెళ్లారు. ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందారు.