WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని మూడుచెక్కలపల్లి శివారు బుల్యాతండాకు చెందిన రైతు బానోత్ భజ్యాపై కోతుల గుంపు దాడి చేసింది. పంటకు నీళ్లు పెట్టి తిరిగి వస్తుండగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కోతులను తరిమి 108కు సమాచారం అందించగా, బాధితుడిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి కోతులను నియంత్రించాలని ప్రజలు కోరారు.
తెలంగాణ
కోతుల దాడిలో రైతుకు తీవ్ర గాయాలు.


