హైదరాబాద్: 28°C
తెలంగాణ

జ్వరంతో తల్లి మృతి.. తలకొరివి పెట్టిన కూతురు

MHBD: పెద్దవంగర మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన పోతుకూనూరి సుమలత జ్వరంతో తీవ్ర అస్వస్థకు గురై, మరణించింది. సుమలతకు ఇద్దరు కుమార్తెలు హర్యవర్ధిని, నవ్యశ్రీలు మాత్రమే ఉన్నారు. కుమారులు లేకపోవడంతో చిన్న కుమార్తె నవ్యశ్రీ తల్లికి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఇది చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.