హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌లో దాండియా సందడి

KNR: కరీంనగర్‌లోని ప్రసిద్ధ శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి దాండియా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో దాండియా నృత్యంతో అలరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.