హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కలను ధ్వంసం చేసిన ఘటనపై కేసు నమోదు

MNCL: వేమనపల్లి మండలం చామనపల్లి బీట్ పరిధిలో సుమారు 500 మొక్కలను ధ్వంసం చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు నీల్వాయి SI నాగరాజు తెలిపారు. తమ సిబ్బంది మొక్కలు నాటే పనులు నిర్వహిస్తుండగా కొందరు గ్రామస్థులు అడ్డుకొని, మొక్కలను పీకి వేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు. ఈ ఘటనలో సుమారు రూ.30 వేల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.దర్యాప్తు కొనసాగుతుందన్నారు.